| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
36. సిగ్గరితలపులు |
| 36. సిగ్గరితలపులు |
|
సిగ్గాయెనుగా నామదికి చీకటి జని శ్రీకృష్ణునిగన తడబడు నడుగులజాడ తెలియునను తలపున మెల్లన దరిజేరగబో ముసిముసినగవుల మురిపెపునడకల పసదెలసెనె మణికాంతుల నగపతి వలదన్నను నా వాతెర చవిజూ చలరించిన విభు నెడబాసి బ్రతుక. |