కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
ప్రశంస

ప్రశంస
శ్రీ ముద్దుకృష్ణ - ("వైతాళికులు"నుండి.)

"తెలుగు పుట్టింటి నుడికారం ఈమె గీతాలలోని ప్రత్యేక కమ్మదనం. సంస్కృత, ఇంగ్లీషు కోటరికాలలో ఊపిరాడని తెనుగునకు ఈయమ పలుకురాక అలనాటి తీయని తెనుగు ప్రాణవాయువు కాగలదు. తెనుగు కడుపున పుట్టి చేవదేరిన నుడికారం ఈమె భాష పోకడలలోనూ, తాటాకు బొమ్మలకు ప్రాణంపోసి కన్నబిడ్డనుగా చంకను యెత్తగలిగిన పసినాటి తెనుగు భావన ఈమె ఊహా వీధిలోనూ ... ఈమె ఊహాప్రపంచంలో యెంత గారడీ వున్నదో ఆనందించవలెనంటే 'ఆకొండ' లోని చోద్యాన్ని బట్టి గ్రహించవచ్చును. పుట్టుకతోనే కవిత్వం, పాండిత్య ప్రకర్షతో దీనికి సంబంధం లేదు అనుటకు ఈమె తార్కాణం."

AndhraBharati AMdhra bhArati - kavitalu - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu vaktavyamu - SrI mallaMpalli sOmaSEkhara Sarma - Mallampalli Soma Sekhara Sarma - geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )