కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
రక్షణ మందిరం
రక్షణ మందిరం
గాలికి ఊగే
తెరచాపై కదిలింది
రెక్కలు విప్పింది
ఎవరో బంధించిన
ఎముకల పంజరమ్ములో
ఆత్మ
ఎగరాలని
హేమంత శర్వరీ కురులు
ఇరులు
మంతన మాడాయి
పాతాళమ్మున
బలి ప్రభృతుల
చూపుల నీలిమ
లోని లోతులను
కలిచింది.
కట్టు తెగిన
కాలభైరవుడు
గాలి
పండుటాకుల
మ్రోడుటాశల
మరణ శయ్యనె
పరిచాడు
క్రొత్తసృష్టికే
పిలిచాడు
జీవితాంతపు
వెలుగులు
కాంతి గోళములు
కమ్మని మృత్యు పరీమళము
రమ్మని పిలిచాయి
వేడితగ్గిన రక్త
పురాణ అస్థులు
ఏటికి నీ వలపంత?
రక్షణమందిర మంటావు?
రాను! పొమ్మన మంటావు?
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - raxaNa maMdiraM - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )