బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి ఏనుగమ్మా ఏనుగు!

ఏనుగమ్మా ఏనుగు!
ఏనుగమ్మా ఏనుగు!
ఏ ఊరొచ్చింది ఏనుగు?
మా ఊరొచ్చింది ఏనుగు.
ఏం చేసింది ఏనుగు?
మంచినీళ్లు తాగింది ఏనుగు.
ఏనుగు ఏనుగు నల్లన్న,
ఏనుగు కొమ్ములు తెల్లన్న,
ఏనుగుమీద రాముడు
ఎంతో చక్కని దేవుడు!
AndhraBharati AMdhra bhArati - EnugammA Enugu! - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )