| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | చప్పట్లు |
| చప్పట్లు | |
![]() |
చప్పట్లోయి, తాళాలోయి, దేవుడిగుళ్లో మేళాలోయ్! పప్పూ బెల్లం దేవుడికోయ్, పాలూ నెయ్యీ పాపాయి కోయ్! గోవిందుడమ్మా! గోపాలుడమ్మా! కొబ్బరీ బెల్లమ్ము, కొనితెచ్చినాడే. ఏడాది కొకసారి ఇటువచ్చినాడే. పల్లెటూళ్లుగాన, చెల్లిపోయింది. గొల్లవాళ్లముగాన, కూడివచ్చింది. పట్నవాసములోన పనికివస్తుందా? |