| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | ఎందుకు? |
| ఎందుకు? | ||
![]() |
ఎండలు కాసే దెందుకురా? మబ్బులు పట్టే టందుకురా. మబ్బులు పట్టే దెందుకురా? వానలు కురిసే టందుకురా. వానలు కురిసే దెందుకురా? చెరువులు నిండే టందుకురా. చెరువులు నిండే దెందుకురా? పంటలు పండే టందుకురా. పంటలు పండే దెందుకురా? ప్రజలు బ్రతికే టందుకురా. ప్రజలు బ్రతికే దెందుకురా? స్వామిని కొలిచే టందుకురా. స్వామిని కొలిచే దెందుకురా? ముక్తిని పొందే టందుకురా. |
![]() |