బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి నెత్తిమీద గోరింక

నెత్తిమీద గోరింక

ఓఅ(బ్బా)మ్మాయి నెత్తిమీద గోరింక;
చెప్పకు చెప్పకు చెడిపోతావు,
చెప్పితే నీ ముక్కు తెగ్గోస్తా,
దూలంమీంచీ దూకిస్తా,
పందిరిమీంచీ పాకిస్తా,
కంచం అన్నం తినిపిస్తా,
కడివెడునీళ్లు తాగిస్తా!
AndhraBharati AMdhra bhArati - nettimIda gOriMka - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )