బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి తాతపెండ్లి

తాతపెండ్లి

ఊచకఱ్ఱో, ఉగ్గమోచేత,
ఊగుతూ వచ్చిన్న తాతెవ్వరమ్మ?
        మానికా నిండాను మాడ లోసుకుని,
        మనుమరాలా నిన్ను మను మడగవస్తి;
వాడిన్నపూవుల్లు వాసనలు గలవా?
ఓతాత! ఈ మనుము వొద్దయ్య నాకు!
AndhraBharati AMdhra bhArati - tAtapeMDli - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )