బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి సందెగొబ్బె

సందెగొబ్బె
సీతమ్మ వాకిటా
చిరుమల్లెచెట్టు
చిరుమల్లెచెట్టేమొ
చితుకచూసింది.
(చిగిరించి పూసె)
చెట్టు కదలాకుండ
కొమ్మవంచండి;

పట్టి పూవులుకోసి,
బుట్ట నింపండి;
అందులో పెద్దపూలు
దండ గుచ్చండి;
దండ తీసుకువెళ్లి
సీత కివ్వండి.

దాచుకో సీతమ్మ
దాచుకోవమ్మ!
(రాముడంపాడు)
దాచుకోకుంటేను
దోచుకొంటారు;
దొడ్డి గుమ్మములోన
దొంగలున్నారు.
AndhraBharati AMdhra bhArati - saMdegobbe - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )