భాష ఛందస్సు సులక్షణసారము
1.1. అవతారిక
క. శ్రీ వనితాసమ భూతన
యా వక్షోజార్ద్రకుంకు - మాంకిత వక్షున్‌
బావనతర చారిత్రుని
సేవించెదఁ జదలువాడ - శ్రీరఘురామున్‌.
1
సీ. శ్రీ వైష్ణవహితుండఁ, - జిక్కయభట్టరు శిష్యుఁడఁ, గవితావి - శేష శేష
తులిత సర్వార్యు పౌ - త్రుండ, లక్ష్మయకుఁ దిమ్మాంబకు సుతుఁడఁ, బే - రనకు మాచ
నకు రామకవివరు - నకు ననుజన్ముఁడ, నా రామకవి చెప్పి - నట్టి మహిత
మత్స్య పురాణ వా - మనపురాణాది సత్కవితల కెల్ల లే - ఖకుఁడ వృద్ధ
 
గీ. కుండికాతీర లింగమ - గుంట నామ
పట్టణస్థితికుండ సౌ - భాగ్య యుతుఁడ
నాదిశాఖా ప్రవర్తన - నమరువాఁడఁ
గాశ్యపగోత్రుఁడను దిమ్మ - కవిని నేను.
2
1.2. ఛందోమహిమ
క. విద్యలలోపల నుత్తమ
విద్య కవిత్వంబు మఱి క - విత్వము ఛందో
వేద్యము గావునఁ జెప్పెద
హృద్యంబుగఁ గవిత చంద - మేర్పడఁ గృష్ణా! (అనంతుని ఛందము)
3
క. లక్షణ శాస్త్రములెల్లఁ బ
రీక్షించుటఁ గొంత కొంత - యెఱిఁగిన వాఁడన్‌
లాక్షణి కానుగ్రహత సు
లక్షణసారము రచింతు - లక్ష్యము లమరన్‌.
4
తే. కొంద ఱెంచెడు రీతులఁ - గొందఱెంచ
రందఱును జెప్పినవి గొన్ని - యవియు నవియు
దొరయఁగా గూర్చి కవి సమ్మ - తులను వ్రాయు
దుక్త లక్ష్యాస్పదంబు లాం - ధ్రోక్తు లెనయ.
5
తే. గ్రంథ సామగ్రి గలుగుటఁ - బ్రతిపదమున
కన్ని లక్షణములు వ్రాయు - దనిన నందు
గ్రంథ విస్తరమగుఁ గానఁ - గవిత సూత్ర
మెన్నిటను దేటపడు నన్ని - యే రచింతు.
6
AndhraBharati AMdhra bhArati - bhAshha - ChaMdassu - sulakShana sAramu - vishhaya sUchika - liMgamaguMTa timmakavi - sulaxaNa sAramu vellaMki tAtaMbhaTTu andhra telugu tenugu ( telugu andhra )