| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 51. కోరికలు |
|
కోటాకు యెల్లాలి కోటాకు యెల్లాని కోటప్ప కొండాకు - యెల్లీ రావాలి కోటప్ప తిరుణాలు - సూసీ రావాలీ. కొండాకు యెల్లాలి కొండాకు యెల్లాలి కొండాల తిరుపతి - యెల్లీ రావాలీ యేడు కొండలోడ్ని - సూసీ రావాలీ. అలివేలు మంగమ్మ అలివేలు మంగమ్మ అలుగూలు తీర్చగ - పోయీ రావాలీ అలివేలు కుంకూమ - అందీ రావాలీ. |