| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 52. దూడ పాట |
|
మాదీ దూరంగబెట్టి పంబేకర సాహెబా ఎర్రకోక పిల్లనాకె కావాలిరా... అప్పలమ్మ గండికాడ కప్ప చచ్చిందీ రారోరీ తమ్ముడా మోసుకెడతాము నాయెద్దు, నీయెద్దు నీళ్ళ కెళ్ళింది తాతగారెద్దొచ్చి తనిమి తరిమింది... మామగారెద్దొచ్చి మంత్ర మేసింది ఎద్దు కొమ్ములమీద పొద్దు పొడిచిందీ పొద్దుపోయి నాగన్న గుడ్ల కొచ్చింది అందులో ఓ గుడ్డు జారి పోయింది జారిపోయిన గుడ్డు జల్లిడ కలిసింది జల్లెడలో సీతమ్మ స్నాన మాడింది. |