| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 53. గొబ్బిళ్ళు |
|
గొబ్బీయళ్ళో గొబ్బీ గొబ్బున చెలియాలందరు గొబ్బీ పాటలు పాడారే... సర్వమునకు సృష్టికర్త సర్వేశ్వరుడొక డున్నాడే సర్వేశ్వరుని ఘనత నాకూ చక్కగ వినీపింపారే నల్లగ నుండునా లేక తెల్లగ నుండూనా ఎట్టి గుణము కలవాడూ ఎవరికి మంచీ వాడే దుష్టతనము మనలో వుంటే చేరీ బుద్ధులు చెప్పూనే గొబ్బీయళ్ళో గొబ్బీ గొబ్బున చెలియాలందరు గొబ్బీ పాటలు పాడారే... |