| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 68. సామోరు పాట |
|
రాయే రాయె భామానందనా రమణీ ముద్దుల గుమ్మానందనా సామోరు సత్తెమకూడేను సరివాదములు యేసుకొన్నారు వేడికూటేళాకి యారాలు తెస్తాను సల్దికూటేళాకు సవితీని తెస్తాను చాల పొద్దూలేదు సరివాదమేశారు రాకయ్య రాకయ్య సామోరూ పొద్దుచాలలేదయ్య సామోరూ మా అన్నలొస్తారు సామోరూ మమ్మల్ని తిడతారు సామోరూ మిమ్మల్ని కొడతారు సామోరూ రాకయ్య రాకయ్య సామోరూ పొద్దుచాలా లేదయ్య సామోరూ ఏడుగురు అన్నలు సామోరూ వచ్చే వేళాయింది సామోరూ |