| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 67. కారు పాట |
|
కాంతమ్మో... కారెళ్ళి పోతూంది కాంతమ్మ కడియాలు కారుమీ దున్నాయి కాంతమ్మ చీరాలు కారుమీ దున్నాయి కాంతమ్మ వస్తువులు కారుమీ దున్నాయి కాంతమ్మ చూపులూ కారుమీ దున్నాయి కాంతమ్మ మనసూ కారుమీ దున్నాది కాంతమ్మ పట్టాలు కారుమీ దున్నాయి కాంతమ్మ ప్రాణాలు కారుమీ దున్నాయి |