| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (సువ్విపాటలు - రోకలి బరువును మరిపించేవి) |
| 015. సువ్వి పాట |
|
సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వి రామాభి రామ సువ్వీ లాలీ ఆ సువ్వి - ఆ సువ్వి ... తుమ్మకర్రరోలు దోసి తూముదొడ్లు వాయవేసి దంచుదామా బియ్యం దంచుదామా ఆ సువ్వి - ఆ సువ్వి ... ఒక్కవేలు చుక్క బొట్టు అందరికీ చాలదమ్మ దంచుదామా బియ్యం చెలియ లందరు ఆ సువ్వి - ఆ సువ్వి ... ఒకరి ఒకరి కొప్పులోన గుప్పెడేసి మల్లెమొగ్గలు మగువ కాంత కొప్పులోన మల్లె జాజులు ఆ సువ్వి - ఆ సువ్వి ... |