| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (పెళ్ళిళ్ళ సమయంలో - మొగపెళ్ళివారు భోజనాల సమయంలో పాడేది) |
| 016. నగల పాట |
|
మిమ్ముల మేము చాలా సొమ్మడగే లేదు మీరూ మాకూ చాలా నగలూ పెట్టా లేదూ ... గాజులు కెంపులు మురిడీ గొలుసులు తోడాల్ జతలు ... బెంగుళూరువడ్డాణం చంద్రహారం, కాసులపేరూ కంటె మాకు కావాలండీ ... రవ్వలు చెక్కిన బంగరుజడా చేయించండి దానికితగినా కెంపులబిళ్ల చేయించండి ... కులాసాగ వుండేటందుకు అద్దాలమేడ, దానిమీదికీ జోడుకుర్చీలు చేయించండి ... పందిరిమంచం దోమతెరా తెప్పించండి దానిమీదికీ పట్టుపరుపులూ తెప్పించండి ... కోరిన నగలు కొదవులేక చేయించండి కోపము మనసులో ఉంచుకోకండి ... |