| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (హాస్యపూరితమైన అప్పగింత పాట) |
| 023. అప్పగింత |
|
అత్తమామలుగాని ఆడబిడ్డలుగాని లేరమ్మ నీదెంత పున్నెమో గాని మగడు ఒక్కడుగాన మనసుకెక్కిన యట్లు మర్థించి నీ వశము చేసుకోవమ్మ నీమాట వినుపించు ఆ నిముషమందునా గజగజ వణుకునట్లు గడిగీసి చూపు ఇరుగు పొరుగమ్మలు ఏమైన అంటే హడలిపోకను నీవు హడలు కొట్టమ్మ పతికోప పడినపుడు పడియుండ బోక అంతకు పదిరెట్లు అతని మర్దించు భర్తను వంచుకోగల భార్య గౌరవమెన్న రారాజునకు నైన రమణిరో లేదు. |