| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (పరాత్పరుడిని మేలుకొలపడం - వింతకాదూ మరి! దీనులను కావడానికి తెల్లవారు సమయంలో భూపాళరాగంలో పాడే ఈ మేలుకొలుపులు ఎంతో వీనులవిందుగా వుంటాయి. సాతానికి కాపీరైటు హక్కు, స్త్రీలకే వారసత్వపు హక్కులు గలవి యివి) |
| 024. మేలుకొలుపు |
|
మేలుకో సుగుణాల పాలా జానకీలోలా భక్తా పరిపాలనా మేలుకో ... వాలాయముగ మమ్ము పాలించూ వేళాయే ఓవైకుంఠ వాసూడా మేలూకో ... తీరైన కస్తూరీ తిలకంబు జారిందీ తీర్చీ దిద్దావలె మేలూకో ... భేరీ మృదంగీ వీణాది రవములూ భోరూకొలుపసాగే మేలుకో ... అత్రివశిష్టాది మునులూ మీ కృపగోరీ పాత్రులై వున్నారు మేలుకో ... పారీజాతా కుసుమా మాలీకా చేబట్టి నారాదాముని వచ్చె మేలుకో ... వెల్లా టేనుగ వచ్చి వాకిటా నిలచిందీ నల్లనీ నాస్వామి మేలుకో ... కల్లగాదు జగ మెల్లా ఏలేడు స్వామి వల్లభా యిక నిద్ర మేలుకో ... పాలవారధియందు పవ్వాళించీ యోధా పరమేశా యికనిద్ర మేలుకో ... |