| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 037. తలుపు దగ్గర పాట |
|
వాకిలి తీయగదే వారిజ ముఖి కోమలాంగనాపై కోపముసేయక కోరి వచ్చిన వాడనే వాకిలి వేగ ... మాటిమాటికిని మారము సేయక మురహర పోపోరా మోహనాకారా .. పారిజాతమ్ములు పణతి నీకిస్తును పంతగించక తీయుమా వాకిలి వేగ ... సత్యభామతో గూడీ సరసమ్మూ లాడగా సరసుడ లేచిరారా వాకిలితియ్యనూ ... సుదతులందరిలోనూ సుందరాంగీవానీ వలచీవచ్చినావాడానే చెలియారో వేగ ... దోసీలొగ్గితినమ్మ దోషాములెంచక దాసూడాను దయనుచూడుమా దయతోడ చెలియా ... |