| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (హాస్యం యే సాహిత్యానికైనా ప్రధానం వహిస్తూంది. దీనిలోనూ అంతే - వెక్కిరింతలుగా - వేళాకోళాలుగా - ద్వంద్వార్థాలతో - కడుపుబ్బ నవ్వించే హాస్యపాటలు ఎన్నో.) |
| 038. హాస్యం |
|
తాటిచెట్టు ఎక్కాడు పెళ్లికొడుకూ! తాటికల్లు గీశాడు పెళ్లికొడుకూ! చప్పట్లు కొట్టారు మరదళ్లూ తాళాలు వేశారు ఒదినగార్లూ మేళాలు చేశారు వారివాళ్లూ భాగోతం కట్టారు బావగార్లూ కల్లు తాగిన పెళ్లికొడక దిగిరావోయ్ కళ్లెర్రబడ్డాయి మూసుకోవోయ్ కాళ్లబందం విప్పుకోవోయ్ పెళ్లికొడకా పసుపైన పూస్తాము పెళ్లికొడకా నామాలు పెడతాము పెళ్లికొడకా నామాట వింటావ పెళ్లికొడకా టోపీలు వేస్తాము పెళ్లికొడకా సోకూగ కూర్చోవోయ్ పెళ్లికొడకా |