| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 044. లాలి పాట |
|
లాలీ శ్రీరామా గుణరామా రవికుల సోమా పరమడోలిక పాన్పుపై నీ పవ్వళింపగ చేతూ పవళింపగా జేతునా తనయా పాటలూ పాడిస్తూ .. అల్లరి చేసిన నిను బూచివాళ్లెత్తుకు పోదురుగ ఎత్తుకుపోదురుగ తనయా ఏలేడ్చెదవూ రా .. అవుగో పక్షులు వృక్షాగ్రముపై కూయూచున్నవీరా కూయూచున్నవీరా కుమారా కోలాహలమదిగో .. అదిగో కోకీల ఆకాశామూపై ఆడూచున్నదిరా ఆడూచున్నదిరా కుమారా అల్లరీ యిక మానూ .. |