| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 045. ఆట పాట |
|
చిట్టి బొమ్మలపెండ్లి చేయవలెనన్న శ్రీరెండు వాకిళ్లు శ్రీతోరణాలు గాజు స్తంభాలనే బూజంబుబుడ్లు అరటి స్తంభాలనే అమరపెళ్ళరుగు చిన్నన్న పెట్టాడు చింతాకు చీర పెద్దన్న పెట్టాడు పెద్దల సొమ్ము నాయన్న పెట్టాడు నానుతో పుస్తె నాయక్క పెట్టింది పసుపాడు పళ్లెంబు పసుపాడు పళ్లెములో పచ్చనక్షతలు పచ్చనక్షతలేనే పుట్టినిల్లు ముత్యాలు కూర్చిన ముక్కాలిపీట రుద్రుడు మీనాన్న కూర్చుండగాను పచ్చల్లు చెక్కన్నా పట్టెపంచమ్మ పార్వతి మీతల్లి పాలివ్వతగును. |