| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 047. లాలి పాట |
|
బాల గోపాల రార ఉయ్యాల లూగ .. బాల గోపాలను రార పాలూ వెన్నారగించా నీలా వర్ణూడ రార కాళింగి మర్దనుడ .. బంగారు తొట్టేలోనూ చంగావి మెత్తావేసి శృంగారించెదను రార ఓరోరి కృష్ణా .. గొల్లా వారిళ్ళలోనూ కుండా పెరుగారవించి దండితనము సేయకురా .. అండాజనారక్షక పుండారీకాక్ష వరదా పళ్ళుపాలూ పెరుగు మనయిళ్ళనే కలవుదేవా .. మంగళ వీణా వాయిద్య సంగీతమ్ములే పాడుచు పొంచుతొట్టెలోను రంగయ్య నిదురపోరా .. |