| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (తను అల్లరివాడు - అమ్మ పట్టుకుని కట్టిపెడుతుంది - లేదా కొడుతుంది - అది కృష్ణునికి తెలుసు. అందుకే తల్లి ఎంత లాలనగా పిలుస్తూన్నా - "వుహుఁ" అంటున్నాడు.) |
| 061. కృష్ణలీలలు |
|
బాలూలాతో గూడి చాలా అలిసితివింక పాలుత్రాగుదు రార గోపాలా పాలూ త్రాగూ మానీ లీలాతో పిలిచీ రోలాకట్టెదవమ్మ రాజాలా .. వెర్రితనమున నీవు ఎండాలో తిరిగావు సంధ్యా ఎండరార గోపాలా సంధ్యా ఎండగొట్టి గుండెలెండూనని దండింతువే తల్లి రాజాలా .. బాలకృష్ణ నీకు పాలూ చక్కెర యిచ్చి పాటా పాడెదరార గోపాలా పాటా పాడెద నానీ పాముల్ని విడిచేవు రాజాలా .. గోవింద రారా కోరిన పండిచ్చి కోర్కె తీర్తు రార గోపాలా కోరినా పండిచ్చి కోర్కె తీర్తు నానీ కోపింతువే తల్లి రాజాలా .. |