| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (పసిపాప - తనను ఎలా అలంకరించాలో, ఏ నామాలలో పిలవాలో అడుగుతున్నాడు.) |
| 062. చెమ్మ ఆట |
|
కొండెకూ పూలు జుట్టవే అమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే. చిన్నారి నామాలెట్టవే అమ్మ నాకు వన్నేలా సొమ్ములెట్టవే. వీరుడనీ నన్ను పిలువవే అమ్మ నన్ను వీరులా ఖ్యాతి అనావే. కుచ్చూలా జడలు వెయ్యవే అమ్మ నన్ను కూర్మావతారుడనావే. పతకాలూ నాకు వెయ్యవే అమ్మ నన్ను అయోధ్య రాముడనవే. చేతి వంకీలు నాకు పెట్టవే అమ్మ నన్ను వయికుంఠ వాసుడనావే. వేలికుంగరం నాకు పెట్టావే అమ్మ నన్ను వెలలేని కృష్ణుడనవే. మొలకు గజ్జలు నాకుకట్టవే అమ్మ నన్ను మోక్షావతారుడనవే. కాలికందెలు నాకు పెట్టావే అమ్మ నన్ను కలికావతారుడనావే. ఒళ్ళంత సొమ్ములేయవే అమ్మ నన్ను వజ్రాల వాసుడనావే. పట్టు పంచలు నాకు కట్టవే అమ్మ నన్ను పార్వతీ తనయుడనావే. |