| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (గృహకృత్య సారస్వతానికి మొదటిపంక్తి) |
| 091. దంపులు |
|
రోకలి చిన్నాది రోలూ చిన్నాదీ సువ్వీ హా సువ్వీ నాతో దంచేటి చెలియ చిన్నాది సువ్వీ హా సువ్వీ నా చేతి రోకలీ నల్ల రోకాలీ సువ్వీ హా సువ్వీ నేపాడినన్నల్లూ రామలక్ష్మణులు సువ్వీ హా సువ్వీ వీరెక్కు గుర్రాలు నీలీ మేఘాలూ సువ్వీ హా సువ్వీ రోకలికీ నా రెండూ దండాలూ మముగన్న తల్లీకి వేయీ దండాలూ సువ్వీ హా సువ్వీ |