| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| 092. దంపు పాట |
|
దంపు దంపాలేను దంపా చూడాలేను దండెత్తి ధాన్యమూ దంచాగా లేనూ సువ్వీ హా సువ్వీ నిమ్మలా బుగ్గపాప పుట్టీనాడూ నిమ్మతోటకు తోడి నీరెట్టినాడు నిలువునా నిమ్మల్లు లేచి కాయంగ నిగనిగ పండ్లన్ని బుట్టాలు నిండా సువ్వీ హా సువ్వీ సంతకూ బుట్టలూ బండ్లాతో చేర్చె సంతోషమున డబ్బు జేబూలోకొచ్చె సరసాలకాతోట సల్లన్ని తోట సంతపోయే జనపు సంపెంగ తోట సువ్వీ హా సువ్వీ |