| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (ప్రాచీన సాహిత్యంలో "ఎరుకలసాని: (సోదె చెప్పే జ్యోతిష్కురాలు)కి పెద్ద గౌరవం - నిండుపేట - భవిష్యత్ మీద పెత్తనం - రేపటి మాటలను నిన్ననే చెప్పి బహుమానాల నందుకోవటంలో గడుసరి - చూడండి సోదె చెబుతుంది) |
| 093. సోదె |
|
ఆవోయమ్మ బాగ్గెం గల సేయి దాన ధర్మపు సేయి దండిగల సేయి ఒకటంటే ఒకటి రెండంటే రెండు ఒకటీ రెండూ కలసి సంగమించేనూ మంధార లాయమ్మ మల్లెలా తావి అందాల బాలొస్తే సందడే లేద? ఒచ్చి ఉండారమ్మ ఊరు శివరాకి శివురాత్రి శివుడికీ సెపము సేసుకో కొడుకు పుట్టాలని కోరుకో తల్లి ఆదివారమునాడు అమాశనాడు అపోశనమ్ముతో అణిగి మణిగుండు కులము నిలిపేటంటి కొడుకు గలిగేను కులము బలము కలిగి వరిదిల్లు తల్లీ. |