| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (అత్త అధికారం - పచ్చిపాలమీద మీగడ ఎక్కడిది చెప్పండి? అందుకే వేడిపాలమీద వెన్న ఉంటుందని కోడలంటూంది) |
| 102. దంపు పదం |
|
కోడలా కోడలా పచ్చి పాలా మీద మీగడేదే? వేడి పాలా మీద వెన్న లేదే? అత్తనువు బెట్టి ఆరేళ్ళు గాని పచ్చి పాలా మీద మీగ డుంటుందా? వేడి పాలా మీద వెన్న వుంటుందా? |