| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ప్రణయకలహాదివర్ణనము |
| తే.గీ. | రాజకీరంబు లవ్వేళ రాజవేష ధారియై మున్ను దా నున్న మేర లెన్న నంకగతయైన శ్రీదేవి నాదరింప కపుడు గోవిందుఁ డొకలేనియలుకఁ బూని | 330 |
| చం. | అవు నవు మంచిదాన వతివా నిను నే మనవచ్చు నొంటిగా నవని ననున్ ద్యజించి సభయం దపు డిద్ధర ద్రోవ యియ్యఁగా నవమతిఁ జేసి వచ్చితివ యాకఱకుందన మాత్మ నెంచినన్ దివిరి కనుంగొనన్ దగునె నీ మొగ మింకఁ దలోదరీమణీ! | 331 |
| తే.గీ. | అనుచు శ్రీలక్ష్మితోఁ బల్కి, యవనిదిక్కు, మాఱుమొగమైననేనేమి నేరమాచ రించితినొ యంచు ధరణిప్రార్థింపనీవె కావె తోడ్తెచ్చి తని చక్రధరుఁడు వల్కె | 332 |
| వ. | అప్పుడు | 333 |
| మ. | కరపద్మంబులు మోడ్చి పద్మ యను నోకంజాక్ష నామీఁదనే తిరుగన్ దప్పు ఘటించి మీ రనిన వాదింపంగ నే నేర్తునే నరు లే మో యొకనిందఁ బెట్టి రని కాంతారంబునన్ ద్రోయఁ బం పరె వేయేం డ్లెడఁబాసి గాసిలనె మీపాదంబు లూహింపుచున్ | 334 |
| కం. | నను మును గలుగఁగ నిచటికిఁ బనుచుతలంపునను గాదె ప్రత్యయ మిమ్మం చనుట మిముఁ గానకుండన్ గొని తెచ్చెనె ధరణి యేల కోపింపంగన్ | 335 |
| చం. | గతజలసేతుబంధము లిఁకన్ బని యేమని యెన్ని కార్యముల్ మతిని సహించియున్న నను మాటికి నిచ్చట నేర మెన్న వ చ్చితిరె యటంచు మో మవలఁ జేసిన ప్రేయసిఁ జూచి శౌరి న వ్వితి క్షమియింపవే యనుచు వేమఱుఁ గౌఁగిట గ్రుచ్చె మచ్చికన్ | 336 |
| చం. | ఉరమున నిట్లు శ్రీరమణి నుంచుక భూవనితాంసవీథి శ్రీ కర మిడి నీళపెందొడలఁ గమ్రకరాబ్జము సాఁచి కేళినీ శ్వరశతకోటిరూపవిభవం బెసఁగన్ ఫణిరాట్ఫణాళిపై నొరఁగి ప్రహర్ష మొందె హరి యుజ్జ్వలసౌఖ్యరసైకలోలుఁ డై | 337 |
| తే.గీ. | ఇటువలె నిసర్గవైభవం బెసకమెసఁగ శ్రీధరానీళలను గూడి శేషగరుడ ముఖ్యదాసులఁ బ్రోచుచు ముదముఁజెందె నఖిలరక్షాచణుండు నారాయణుండు | 338 |