| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | వప్రవర్ణనము |
| సీ. | కృష్ణపక్ష విభావరీ వేళలఁ జకోర - సమితి చంద్రిక లంచు సంతసింప వలిప క్రొందళుకు మేల్ వెలిపట్టుఁ బుట్టముల్ - గట్టిన యట్లు దిక్కాంతలలర గంగాతరంగ సంఘము వీటిపైఁ బొర్లి - యేల వచ్చెనటంచు నింద్రుఁ డరయఁ దారకాకైరవోద్యన్నభః కాసార - ముదుటు రాయంచల యునికిఁ దెలుపఁ | |
| గీ. | బరఁగు శరదంబుధర దిగంబర గురు ప్రకాశ పేశల వజ్ర సంఘటిత వప్ర దీప్రరోచిః పరంపరల్ దివముఁ బ్రాఁకి పరతమోలీల దూలనప్పట్టనమున | 3 |