| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | పరిఖావర్ణనము |
| మ. | హరిదశ్వస్ఫురదశ్వ ఘోర ఖుర భిన్నారామభూనారికే ర రసారుట్ఫల నిర్గళద్విమల నీరస్ఫారధారాధరాం తర వర్తిష్ణుతఁ దోయ పూర్తిఁ గని దానన్ మబ్బు ధారాధరా ఖ్య రహింపన్ జలరాశి వ్యర్థమయి ఖేయస్ఫూర్తిఁ గొల్పెం బురిన్ | 4 |
| మ. | పురిఖేయంబుఁ బయోధియుం గని జనంబుల్ రెంటికిన్ భేదమే ర్పరుపం జాలకయున్న బ్రహ్మ వివరింపం బూని వారాశిపైఁ గరమొప్పన్ మణిముద్ర వైచె నది యౌఁగాకున్న నీలచ్ఛవిన్ ధరియింపం గతమేమి యేటికి సముద్రఖ్యాతి మున్నీటికిన్ | 5 |
| మ. | పరిఖాంభోనిధి నప్పురంబు ప్రతిబింబం బొప్పు నే వేళ దు ర్ధరభూలోకధురంధరాహిరవ ఫూత్కారోత్థ కీలావళిం బరితాపంబు వహించి భోగినులతోఁ బాతాళముం బాసి భా సురవాఃకేళికి వచ్చు భోగవతి యంచుం బోల్పఁగా నర్హమై | 6 |