ఇతిహాసములు ఉత్తరరామాయణము అశ్వవర్ణనము
అశ్వవర్ణనము
సీ.రవగాలునకు సాటిరాక గాడ్పు పటాణి - పొదలుసిగ్గునఁ బోయి పొదలఁ జొచ్చె
జోడనల కొకింత జోడు గానేరక - వేల్పురాయని తేజి వెల్లనయ్యె,
బలు నిబ్బరమునకుఁ బ్రతిగాక గరుడి య - నామధేయుని వాహనం బనఁ దగెఁ
జుట్టుఁబర్వులకు నించుకయు నీ డొందలే - కిను హరుల్‌ పిచ్చుకుంటున కగపడె
 
గీ.నింక నీ వాహముల కెద్ది యెన యటంచు
జనులు వొగడ మనోవేగ మెనసి ధార
లొలసి లోకప్రసిద్ధులనూని మేటి
సాహిణుల శిక్ష నలరు నచ్చటి హయములు
17
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju