ఇతిహాసములు ఉత్తరరామాయణము వేశ్యావర్ణనము
వేశ్యావర్ణనము
సీ.ఓడి డస్సినది గాకున్న నెందులకుఁగా - మబ్బు తద్ధూపధూమమున బలియుఁ
దనకంటె ఘనకాంతి గనకున్న నెల వీని - కాశ్రితగతి నేల యావహించుఁ
దమ్ములకంటె నందమ్ములు గాకున్న - నంచ లేమిటికిఁగా ననుసరించుఁ
దమసొంపు గుదియించి తఱుమకున్నను దార - లేటికిఁగా బట్టబైట వ్రేలు
 
గీ.నని ప్రకీర్తింపఁదగు కొప్పు లాననములు
చరణయుగములు నఖములు సాటిలేని
పెంపు వహియింప నెపుడు నిలింపసతుల
సవతునఁ జెలంగుదురు వారయువతు లచట
20
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju