| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | పుష్పలావికావర్ణనము |
| సీ. | పొగడ విరుల్ లేవె మృగరాజమధ్యమ - విటరాజ చెంగల్వ విరులు గావె జాతు లేమైనను సంతరించితె కొమ్మ, - నేర్చుకో వలసిన నీటుకాఁడ వగలాడి యిచట సువర్ణముల్ గల్గునే - కలయిండ్లఁ గలుగును జెలువరాయ తమ్ములఁ జూపవే తరుణీశిరోమణీ - యాడఁగాఁ జనిరి రేపాడి రమ్ము | |
| గీ. | వలయు పున్నాగ తతులేవె వన్నెలాడి యేల యడిగెద వీ యూర నేమి కొదవ యని విటుల జాణతనముల నపహసించి పువ్వు లమ్ముదు రవ్వీటఁ బువ్వుబోండ్లు | 21 |