| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | కణ్వాది మహర్షులు రాము జూడ వచ్చుట |
| సీ. | కణ్వగాలవగార్గ్య కౌశిక వరతంతు - రోమశాదికులు తూరుపున నుండి విముఖశంఖదళాదసుముఖాత్రి కుంభజ - ప్రముఖ మౌనులు దక్షిణమున నుండి జాబాలి కుత్స త్రిశంకులోధ్రక ధూమ్ర - మంకణాదులు పశ్చిమమున నుండి వత్సకశ్యపభరద్వాజగౌతమ పౌండ్ర - జమదగ్ని ముఖు లుత్తరమున నుండి | |
| గీ. | ప్రాప్త సామ్రాజ్య విభవుఁడై బాగుమీఱ దనుజ సంహారు రఘువీరుఁ గని ప్రశంస సేయు తలఁపుల శిష్యప్రశిష్య కోటి గొలువ నరుదెంచి మొగసాల నిలిచి రపుడు. | 88 |
| మ. | మును లేతెంచిన వార్తఁ దెల్పు రఘురాముం జేరి నీ వం చగ స్తి నియోగించిన ద్వారపాలుఁడు సముద్రేకత్వరం బోయి రా ముని సేవించి పరాకు స్వామి ఘటభూముఖ్య వ్రతుల్ వచ్చినా రని విజ్ఞాపన మాచరించుటయుఁ దా నత్యంత హర్షంబునన్ | 89 |