ఇతిహాసములు ఉత్తరరామాయణము శ్రీరాముడు మునులను రావణ జనన వృత్తాంతముల నడుగుట
శ్రీరాముడు మునులను రావణ జనన వృత్తాంతముల నడుగుట
ఉ.తాదృశవిక్రమాన్విత సుతప్రభవంబున కాదికారణం
బౌదశకంఠు జన్మము తదన్వయపద్ధతి తత్తపోమహ
త్త్వాదులు తత్త్రిలోక విజయంబును మున్నగు చర్యలెల్లఁ బు
ణ్యోదయులార! గోప్యదశ నొందిన డాఁపక యానతీయరే!
111
చం.పరులకు డాఁచుపోలికఁ బ్రపన్నులకున్‌ మిమువంటి తెల్వి చూ
పఱులగు పెద్ద లంచితకృపారతి నెంత రహస్యమైన డాఁ
పరు - లలితాత్ములార! యని వల్కెడు రామునిఁ జూచి తత్తపః
పరుల యనుజ్ఞఁ గుంభజుఁడు వల్కె నదంభవచోనిగుంభనన్‌
112
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju