ఇతిహాసములు ఉత్తరరామాయణము దౌవారికుం డగు సూర్యభానుని దశగ్రీవుండు పడఁగొట్టుట
దౌవారికుం డగు సూర్యభానుని దశగ్రీవుండు పడఁగొట్టుట
తే.గీ.అచటి దౌవారికుఁడు మహోహసితతీవ్ర
భానుఁడగు సూర్యభానుఁ డప్పంక్తిముఖున
కడ్డమై యెందు వచ్చెదవనుచు నతనిఁ
జుట్టు నరుదెంచుదైత్యుల బిట్టదల్చె
23
ఉ.సింధువు మించి రావిడని చెల్లెలికట్ట తెఱంగునన్‌ సురా
బంధుబలంబు నిల్పి, నిలుపన్‌ నిలకేఁగెడు పంక్తికంఠు గ
ర్వాంధునిఁజూచి, పోకు నిలుమా చలమా ఫలమా బలాప్తి కీ
బంధుల నొంపవచ్చు?టని పల్కి మహాగదపూన్చి వైచినన్‌
24
శా.కుంభీంద్రంబు మృణాళముం దునుములాగుం దోఁప దానిన్‌ భుజా
శుంభల్లీల సురారి ద్రుంపఁ గని యక్షుం డుగ్రుఁడై తోరణ
స్తంభంబుం బెకలించి వైవ, నతఁడున్‌ దానన్‌ ధరం గూల క
య్యంభోజాసనదత్త దివ్య వరమాహాత్మ్యంబునం గ్రూరుఁడై
25
కం.అత్తోరణంబె కొని నడు
నెత్తి వగుల సూర్యభానునిన్‌ మొత్తినచోఁ
దుత్తుమురై వాఁ డిలఁబడె
నత్తఱిఁ బరువెత్తె నచటి యక్షగణంబుల్‌
26
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju