ఇతిహాసములు ఉత్తరరామాయణము దశగ్రీవుండు శివుని నుతించి యతనివలన వరాదులఁబడయుట
దశగ్రీవుండు శివుని నుతించి యతనివలన వరాదులఁబడయుట
శా.ఆపన్నుండగు పంక్తికంఠుఁడిది యౌనంచున్‌ లలాటేక్షణ
శ్రీపాదాంబుజముల్‌ మనోంబుజమునం జింతింపుచున్‌, వేదవి
ద్యాపాండిత్యము సర్వశాస్త్రకుశలత్వంబున్‌ మహాసాహితీ
నైపుణ్యంబును గానిపింపఁ బొగడె న్గంగోర్మితుంగార్భటిన్‌
90
శా.ఆ స్తోత్రంబున కా మనోద్రఢిమ కా ధ్యానాప్తి కా యీశ్వరుం
డస్తోకప్రియ మావహించి, పెనువ్రే లా వేళఁబై కెత్తినన్‌
హస్తంబుల్‌ వెడలంగఁ బాపికొని దైత్యస్వామి ఫాలస్థల
న్యస్తప్రాంజలియై నుతింపఁ దొడఁగె న్గంభీర వాగ్గుంభవన్‌
91
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju