| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | కార్తవీర్యార్జునుఁడు చెఱఁబెట్టిన రావణుఁ బులస్త్యుఁడు విడిపించుట |
| వ. | అప్పుడు | 256 |
| సీ. | దశకంఠ దర్ప వేదండకంఠీరవ - జయజయ యని వందిజనులు వొగడ రోదసీకుహరంబు భేదిల్ల సేనాము - ఖంబునఁదూర్యఘోషంబు లెసఁగ జంభారి మ్రోల నచ్చరలట్ల గణికాంబు - జాశ్యలు దండలాస్యములు సలుప ఫలముఖోపాయనంబులు దీవనలు నిచ్చి - యెడనెడ బ్రాహ్మణు లెదురుకొనఁగ | |
| గీ. | నఖిలశృంగారములు మించు నాత్మనగర మంచితైశ్యర్యమునఁ బ్రవేశించి సౌధ చారణస్త్రీలు ముత్యాలఁ జల్లుచుండఁ గొలువునకు నేఁగె జననాథకుంజరుండు | 257 |
| గీ. | ఏఁగి పేరోలగమున దేవేంద్రవిభవ మెసకమెసఁగంగ వసియించి యెల్లజనులు వెఱఁగుపడ దైత్యుఁ జెఱసాల వేయఁబంచి యంతిపురముఁ బ్రవేశించె నర్జునుండు | 258 |
| కం. | చెట్టతనంబునఁ బెద్దలఁ బట్టి చెఱం బెట్టినట్టి పాపంబున నే డిట్టైతి వనుచుఁ బౌరులు దిట్టఁగఁ జెఱ నుండె నతఁడు దీనముఖుండై | 259 |
| ఉ. | అంతటఁ గొన్నినాళ్ళకు వియచ్చరులంతయుఁదెల్పఁ బౌత్త్రు వృ త్తాంతము లెస్సగా విని దయాబ్ధి పులస్త్యమహర్షి సంయముల్ చెంతలఁగొల్వ నింద్రుపురిఁ జేరెడు ధాతవిధాన నద్ధరా కాంతుని వీటి కేఁగి కుతుకం బెసఁగన్ మొగసాల నిల్చినన్ | 260 |
| మ. | జనపాలుం గని ద్వారపాలురు పులస్త్యబ్రహ్మ విచ్చేసినాఁ డని విజ్ఞాపన మాచరించుటయు నర్ఘ్యాద్యంచితద్రవ్యముల్ గొని ప్రాగ్భాగమునం బురోధ నడువన్ గోధిస్ఫురత్పాణియై చని యమ్మౌనికి మ్రొక్కి యర్హగతిఁబూజల్ సేసి భక్త్యున్నతిన్ | 261 |
| శా. | ధన్యంమన్యహృదబ్జుఁడై యతని నాస్థానస్థలింజేర్చి మూ ర్ధన్యుం డున్నతభద్రపీఠినిడి యుద్యత్ప్రౌఢిమం బల్కె స మ్మాన్యంబయ్యెఁ గులంబు శ్రీలు వెలసెన్ మాహిష్మతిన్ నే నసా మాన్యప్రాభవశాలి నైతి మిము సంభావించి సేవించుటన్ | 262 |
| ఉ. | వీరు తనూభవుల్ హితులు వీర లమాత్యులు వీరు బాంధవుల్ వీరలు వీరు సద్భటులు వీరలు నేనును నిక్కువంబుగా నీరు గణించినట్టి పనులెల్లను జేసెద మానతియ్యరే! కారుణికాగ్రగణ్య! యని గౌరవమేర్పడ విన్నవించినన్ | 263 |
| పంచచామరము | పులస్త్యమౌని సంతసించి భూతలేంద్రుతో ననున్ బళీ!నృపాల! నీ ప్రియోక్తి భక్తియుక్తి శక్తియున్ దలంప నద్భుతంబు లత్యుదాత్తభోగ సంపదన్ నిలింపనాథుమించి తీవు నీకు సామ్య మున్నదే! | 264 |
| చం. | బలియునిఁ బంక్తికంధరునిఁ బట్టితి వం చొకవింతగాఁగ నీ బలము నుతింపనేల? ప్రతిపక్షులు నిన్నెదిరించి క్రమ్మఱం గలరొ? మహానుభావుఁడ వగణ్యగుణాకర! మాకుఁ బ్రీతిగాఁ బలికనయట్ల యిద్దనుజు బంధవిముక్తునిఁ జేయవే యనన్ | 265 |
| కం. | జనపతి యలరుచు మీ పని చినపని గావించుకంటె శ్రేయము గలదే? యని దశముఖు విడిచి ప్రియం బున నాతని సత్కరించి భూషాదులచేన్ | 266 |
| ఆ.వె. | సత్కరించి వహ్నిసాక్షికం బగుసఖ్య మాచరించి పనుపు నధిపు నెంచి పౌత్త్రు నూఱడించి పరమేష్ఠి సుతుఁడేగెఁ బంక్తిముఖుఁడు నెలవు బాసి చనియె | 267 |
| కం. | చని తనసేనల మున్నిడు కొని యెదురుగ వచ్చు మంత్రికోటుల హర్షం బున నాదరించి వారి చ్చిన పుష్పక మెక్కి దనుజశేఖరుఁ డవలన్ | 268 |