| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు వైచిత్రవీర్యుండు పరమతపోధుర్యుం డయి యుండె; నంత నొక్కనాఁడు నారద పర్వత దేవల మౌంజాయను లమ్మహీనాయకుం జూచువేడ్క నయ్యా శ్రమంబునకుం జనుదెంచిన. | 002 |
| క. |
శతయూపుఁడు నయ్యెడకుం | గుతుకంబున వచ్చె; వారిఁ గుంతి వినయ సం భృతయై యందఱను సమ | ర్చితులుగఁ జేసినఁ బ్రహృష్టచేతసు లగుచున్. |
003 |
| వ. | ధృతరాష్ట్రుకడకుం బోయిన నతండు వినయ సంభ్రమంబులతో వినతుం డైన దీవన లిచ్చి యతని పెట్టించిన దర్భాసనంబుల నాసీనులై యుచిత సల్లాపంబులు సేయుసమయంబున నారదుం డన్నర నాథుతో శతయూప నామధేయుం డయిన ధరాధిపు పితామహుం డగు సహస్రచిత్యుం డను మహారాజు తన పెద్దకొడుకైన శతచిత్యునందు రాజ్యభారం బిడి యియ్యాశ్రమంబునకు వచ్చి తపశ్చరణంబున దుశ్చ్యవన సఖిత్వంబు వడసె; మఱియును బృషథ్రుండును, శైలాలయుండును, బురుకుత్సుండును నిందుఁ దపంబు చేసి యింద్రలోకంబు వడసి రా రాజర్షిసత్తముల నెల్లను నే నీలోకంబున మెలంగుచుండి యియ్యెడం గంటి నయ్యెడం జూచితి; నిది యితరదుష్ప్రాప్యంబయిన పుణ్యప్రదేశంబు; నీకుం గృష్ణద్వైపాయను ప్రసాదంబున నిచ్చట వసియింప సంభవించె’ నని పలికి వెండియు. | 004 |
| సీ. |
‘ధరణీశ! యిచ్చటి తపమున నీవు నా | నృపుల యట్టుల విశిష్టపుఁ బదంబుఁ గందు; నీ తోడన గాంధారియును వచ్చు; | మీకు శశ్రూష యమేయ భక్తిఁ జేసి కుంతియుఁ బతిఁ జేరంగ నరుగు; న | ప్పాండుభూపతి సురపతి సమీప ముననుండి యెప్పుడు నినుఁ దలంచు, నతండు | పోఁడిమి సేయఁగలాఁడు నీకు |
|
| ఆ. |
ధర్మమూర్తి యైన ధర్మసూనుఁడు దన | యాత్మ గాన విదురుఁ డన్నరేంద్రు వినుతతనువుఁ దగఁ బ్రవేశించు సంజయుఁ | డతుల నాకలోకగతి వెలుంగు. |
005 |
| వ. | అనిన విని యాంబికేయుండు గాంధారీకుంతీ సమేతంబుగా సంతోషంబు నొందె; నచ్చటియందఱును బ్రీతాత్ములై; రప్పుడు. | 006 |
| క. |
శతయూపుఁడు నారదుతో | ‘నతుల జ్ఞానాభిరామ’ యడిగెద నిన్నుం గుతుకంబున నొక్కటి; నీ | వితతకృపం దెలియఁ జెప్పవే నా’ కనుడున్. |
007 |
| వ. | ఆ దేవముని ‘నీ యడుగఁ దలంచినది యెయ్యది? యడుగు’ మనిన నతం ‘డిక్కురుపతి సుగతి గను’ నని నిర్దేశించితి; తద్విశేషంబు వినవలతు; వివరింపు’ మనుటయు. | 008 |