| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. |
అనిన విని భీష్ముండు ధర్మవిదు లయిన బ్రాహ్మణుల యనుమతంబున దాని సాల్వరాజున కిచ్చిపుచ్చి, మహోత్సవంబున నయ్యిరువురు కన్యకల విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన |
214 |
| ఉ. |
లాలిత రూపయౌవన విలాస విభాసిను లైన యంబికాం బాలికలన్ వివాహ మయి భారతవంశకరుండు గామ లీ లాలలితానుభోగరసలాలసుఁ డై నిజరాజ్యభార చిం తాలసుఁ డయ్యెఁ; గామికి నయంబున నొండు దలంపఁబోలునే! |
215 |
| వ. | ఇట్లు సకలవ్యాపారరహితుం డై కాశీరాజదుహితల నయ్యిరువుర నతిప్రణయగౌరవంబునం దగిలి. | 216 |
| సీ. |
అమలసుధారమ్య హర్మ్యతలంబుల | నవకుసుమామోద నందనములఁ గృతకాద్రి కందర క్రీడాగృహాంగణ | వివిధరత్నోపలవేదికలను గలహంస కలనాదకమనీయ కమలినీ | దీర్ఘికాసైకతతీరములను రమియించుచును గామరాగాధికాసక్తిఁ | జేసి శోషించి విచిత్రవీర్యుఁ |
|
| ఆ. |
డమరపురికిఁ జనిన, నతనికిఁ బరలోక | విధుల శాస్త్రదృష్టి వెలయఁ జేసి నాపగాతనూజుఁ డఖిలబాంధవులయు | బ్రాహ్మణులయుఁదోడ భానునిభుఁడు. |
217 |