| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
వసుమతీరాజ్యంబువలన నిరస్తులై | మునివృత్తి నత్యుగ్రవనములోన నవయుచుఁ బాండుభూనాథనందను లున్న | వారని విని యతిక్రూరమతుల ధృతరాష్ట్రసుతుల నిందించుచుఁ బాంచాల | యాదవ వృష్ణి భోజాంధు లెల్ల నచ్యుత ప్రముఖులై యప్పాండవుల కడ | కేతెంచి శోకపరీతు లగుచు |
|
| ఆ. |
నున్న నధికధర్మయుక్తుఁ డుపేంద్రుండు | నికృతిఁ జేసి పాపనియతబుద్ధిఁ బాండవులకు న ట్లపాయంబు సేసిన | ధార్తరాష్ట్రులకును దద్ద యలిగి. |
122 |
| క. |
‘అనిఁ గర్ణ శకుని దుర్యో | ధన దుశ్శాసన నవాస్రధారాపాతం బునఁ దృప్తివొందు వసుధాం | గన రాక్షస కాక గృధ్ర గణములతోడన్. |
123 |
| క. |
అవినీతుల వధ్యులఁ గౌ | రవపాంసులఁ జంపి ధర్మరాజునకుఁ గురు ప్రవరున కొనరింతమ, యీ | యవనీరాజ్యాభిషేక మవిజితశక్తిన్. |
124 |
| వ. | అని యుగాంత్యకాల కుపిత కృతాంతాకృతి నున్న జగన్నాథు జనార్దనుం బ్రశాంతచిత్తుం జేసి యర్జునుం డతని నిట్లని కీర్తించె. | 125 |
| ఆ. |
‘పూజ్యుఁడవు పురాణపురుషుండ వీశుండ | వప్రమేయుఁడవు చరాచరంబు లయిన భూతరాసు లచ్యుత! నీయంద | పుట్టు, నిలుచు, లయముఁ బొందుచుండు. |
126 |
| వ. | నీవు దొల్లి గంధమాదనంబునం గందమూలఫలాశనుండవై పదివేలేండ్లు తపంబు సేసి, పుష్కరంబున నేకాదశసహస్ర వర్షంబులు జలంబు లాహారంబుగా నుండి, ప్రభాసంబను తీర్థంబున దివ్యసహస్ర వర్షంబు లేకపాదస్థితుండ వయి యుండి, బదరీవనంబునం బవనంబు భక్షించుచు నూర్ధ్వబాహుండ వయి యేకపాదంబున ననేకసహస్ర వర్షంబులు నిలిచి, సరస్వతీ సత్త్రంబున నవకృష్టోత్తరాసంగుండవై నియమకృశీకృత శరీరంబుతోఁ బండ్రెండు వర్షంబు లశేష వ్రతంబులు సలిపిన తపోనిధానంబవు. నిఖిలలోకజైత్రుండ వయి చైత్రరథంబున నుత్తమక్రతువు లనేకంబులు సేసి యొక్కొక్కక్రతువునకు నూఱేసి లక్షలు సువర్ణంబులు దక్షిణ లిచ్చిన యజ్ఞపురుషుండవు. తపోయజ్ఞంబులు రెంటను సమృద్ధతేజుండ వయి, దైత్యదానవేంద్రుల వధియించి, యింద్రున కింద్రత్వం బేకాధిష్ఠతంబు సేసిన లోకప్రభుండ, వదితికిం గశ్యపునకు నుదయించి, యింద్రానుజుండవై త్రివిక్రమంబునం ద్రిజగంబుల నభివ్యాపించిన విశ్వరూపధరుండవు. | 127 |
| క. |
నరక శిశుపాలు రాదిగ | ధరణీకంటకుల నధికతరదర్పులఁ బ ల్వుర వధియింపఁగ మహి నవ | తరించిన మహాత్ముఁడవు నుతస్థిరశక్తిన్. |
128 |
| క. |
అనృతము, మదమును, మత్సర | మును, గ్రోధము నను వికారములు వొరయునె ని? న్ననుపమ గుణముల నీ కొరు | లెన పోల్పఁగఁ గలరె సురమునీంద్రప్రణుతా!’ |
129 |
| వ. | అని కృతాంజలి యయిన ధనంజయుం జూచి దనుజభంజనుం డిట్లనియె. | 130 |
| తే. |
‘నరుఁడు నారాయణుండు నాఁబరఁగు నాది | మునుల మిద్దఱ; మందు నీ వనఘ! నరుఁడ, వేను నారాయణుండ; ననూనశక్తి | యుతులమై మర్త్యయోనిఁ బుట్టితిమి పేర్మి? |
131 |
| తరువోజ |
నిరతంబుగా నేను నీవను భేద | నియమంబు లే, దైక్యనిష్ఠయ మనకు నిరువురకును, నీకు నిష్టుండ నాకు | నిష్టుండు, మఱి నీ కనిష్టుండ నాకుఁ గర మనిష్టుం, డట్లుగా నమ్ము’ మనుచు | ఘనభుజుల్ భువనోపకారైకమతులు హరియు నర్జునుఁడుఁ బ్రియంబుతోఁ దగిలి | యన్యోన్యహితభాషు లగుచుండు నంత. |
132 |