| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
బిరుదాంకభీమ! భీమే | శ్వర కృత కృత్య! ప్రసాద సౌజన్య గుణా భరణ! పరగండ భైరవ! | పరనృప మణి మకుట ఘటిత పద! బుధ వినుతా! |
399 |
| ఉత్సాహము |
రాజవంశరత్న! రాజరాజదేవ! నిత్యల క్ష్మీ జయాభిరామ! ధర్మమిత్త్ర! మిత్త్ర విద్వదం భోజవన పయోజమిత్త్ర! భూరికీర్తికౌముదీ రాజితత్రిలోక! నిఖిలరాజలోక పూజితా! |
400 |
| గద్య. | ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబునందుఁ బాండవ వనప్రవేశంబును, గిమ్మీరవధయును, గృష్ణపాంచాలాభిగమనంబును, సౌంభకాఖ్యానంబును, నింద్రకీలాభిగమనంబును, గైరాతంబును, నర్జును తపశ్చరణంబును, నీశ్వరుతోడ యుద్ధంబును, బరమేశ్వరు చేతఁ బాశుపతాస్త్రంబు వడయుటయును, లోకపాలసందర్శనంబును, స్వర్గగమనంబును, నూర్వశి శాపంబును, దేవతలవలన దివ్యాస్త్రలాభంబును నన్నది ప్రథమాశ్వాసము. | 401 |