పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము
క. శ్రీరమ్య ధర్మ నిత్య | ప్రారంభవిభాసి! రాజపరమేశ్వర! ఘో
రారి మదకుంభికుంభవి | దారణదారుణకృపాణదక్షిణహస్తా!
1
(సం. 3-49-29)
వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు సాంత్వనవచనంబుల భీమసేనునకుం గోపాటోపోపశమనంబు సేయుచున్న ధర్మరాజునొద్దకు బృహదశ్వుండను మహాముని వచ్చి విధిదృష్ట విధానంబునం బూజితుండయి విశ్రమించియున్న నమ్మునివరునకు ధర్మతనయుం డధర్మపరులయిన పరుల చేతం దమపడిన నికారప్రకారంబంతయు నెఱింగించి యిట్లనియె. 2
క. ‘పుడమియు రాజ్యము బంధుల | విడిచి మృగావలులఁ గలసి విపినంబులలోఁ
గడుకొని మా య ట్లిడుమలఁ | బడిన నృపులు గలరె యొరులు పరమమునీంద్రా!’
3
వ. అనిన నయ్యుధిష్ఠిరునకు బృహదశ్వుం డిట్లనియె. 4
క. ‘దేవసములైన యనుజుల | తో విప్రులతో రథాలితో వచ్చి యర
ణ్యావాసము సేసెదు ధర | ణీవల్లభ! నీవు ధర్మనిష్ఠితబుద్ధిన్‌.
5
క. నరనుతుఁడు దొల్లి నలుఁ డను | ధరణీశుఁడు జూద మాడి తన విభవము పు
ష్కరుచేత నోటువడి యొ | క్కరుఁడ కరం బిడుమఁ బడఁడె కాననసీమన్‌.
6
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - AraNya parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )