| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అయినను నా నేర్చు విధంబునం జెప్పెద నడుగు’ మనిన నజగరం బి ట్లనియె. | 125 |
| ఆ. |
‘ఘనుఁడ! యే గుణములు గలవాఁడు బ్రాహ్మణుం? | డతని కెఱుఁగఁదగినయట్టి వస్తు వెద్ది? దీని నాకు నెఱిఁగింపు’ మనిన ని | ట్లనుచుఁ జెప్పెఁ బాండవాగ్రజుండు. |
126 |
| సీ. |
‘సత్య క్షమా దమ శౌచ దయా తపో | దాన శీలంబు లెందేనిఁ గాన నగు నట్టి వాఁడు బ్రాహ్మణుఁడు; సుఖంబు దుః | ఖంబు నై నెడ విమోహంబు నొంద కునికియ వానికి నుత్తమం బగు విద్య’ | యనిన ‘నీ చెప్పిన గుణము లివియు క్రియ శూద్రునందుఁ గల్గిన నతం డుత్తమ | ద్విజుఁడు గానేర్చునే? నిజము విడిచి |
|
| ఆ. |
నట్టు లయిన బ్రాహ్మణాదివర్ణవిభాగ | మెట్లు గలుగునయ్య? హీను లధికు లను వివేక మది యపార్థకం బగుఁగాదె!’ | యనిన ననియె నంతకాత్మజుండు. |
127 |
| వ. | ‘ప్రమాదంబున వర్ణసంకరం బయినప్పుడు వర్ణ పరీక్షార్థంబుగా బ్రాహ్మణాదులకు వృత్తంబు వేఱువేఱ స్వాయం భువుం డైన మనువు సెప్పె; సత్యాదిగుణంబులు శూద్రునందుఁగలిగెనేని వాఁడు సచ్ఛూద్రుండుఁగాక బ్రాహ్మణుండు గానేర్చునే? యవి బ్రాహ్మణునందు లేనినాఁడు శూద్రుం డనంబడుఁ గావున వృత్తంబ యుత్తమంబు. | 128 |
| తే. |
వృత్తవంతుండు వెండియు వివిధగతుల | వృత్తవంతుండు గా నేర్చు; వృత్తహీనుఁ డైనవాఁడు విహీనుండ యండ్రు గాన | విత్తరక్షకుఁ గడు మేలు వృత్తరక్ష. |
129 |
| వ. | అనిన నజగరం బి ట్లనియె. | 130 |
| తే. |
‘అప్రియంబుఁ జేసియు మఱి యనృతవాది | యయ్యు హింస గావింపని యమ్మహాత్ముఁ డేఁగు సుగతికి నం; డ్రది యె ట్లహింస | యనఘ! యింత విశేష మెట్లయ్యె చెపుమ!’ |
131 |
| వ. | అనిన ధర్మతనయుం డి ట్లనియె; ‘దానంబును బ్రియంబుచేఁతయును సత్యంబును నహింసయు ననునవి నాలుగును సమంబుల యయినను నహింస విశేషం; బెట్లనిన దేవమనుష్యతిర్యగ్యోను లను మూఁడు గతులయందును మనుష్యుండు దానాదిగుణంబులు గలిగి యహింసాపరుం డయిన దేవగతి వడయు; విపరీతవర్తనుండు తిర్యగ్యోనులం బొందు’ నని యిట్లు తన చేసినప్రశ్నంబులకు నుత్తరంబులు చెప్పిన ధర్మరాజున కతిప్రీతుం డై భీమసేనుని విడిచి శాపవిముక్తుండై దివ్యరూపంబు సేకొనియున్న నహుషువలన నధ్యాత్మవిద్యారహస్యంబు లిమ్ముగా నెఱింగి యుధిష్ఠిరుండు వృకోదరుం దోడ్కొని నిజాశ్రమంబునకు వచ్చియున్నంత. | 132 |
| క. |
ఖరకిరణతాపమున నురు | తరదవదాహమున శోషితము లైన వనాం తరతరుతతి కాప్యాయన | కర మై వర్షాగమంబు కడు బెడఁగయ్యెన్. |
133 |
| క. |
నాలుగుకెలఁకుల నవఘన | జాలంబులు వ్రేలి కురిసె ఝంఝానిలవే గాలోలము లై బహుల | స్థూలపయోధార లోలిఁ దుములంబులుగాన్. |
134 |
| క. |
ఘనతరధర్మతమం బొకొ | యనఁగ ఘనాఘనతమిస్ర మవిరళ మై క ప్పిన జనులకు వస్తువిభా | వన మొక్కొకమాటు గలిగె వైద్యుతరుచులన్. |
135 |
| చ. |
అరుదుగఁ దత్పయోదసమయంబున నొక్కట విస్తరిల్లె నం బరమున నంబుదధ్వనియుఁ బల్వలభూముల భూరిదర్దురో త్కరరవముల్ మహీరుహ శిఖండములందు శిఖండి తాండవాం తరమదమంజులస్వన ముదారతరం బగుచున్ వనంబునన్. |
136 |
| చ. |
దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో మిళితసుగంధబంధుర సమీరణ మన్ సఖి యూచుచుండఁగా నులియుచు పువ్వుగుత్తులను నుయ్యెల లొప్పఁగ నెక్కి యూఁగె ను ల్లలదళినీకులంబు మృదులధ్వనిగీతము విస్తరించుచున్. |
137 |
| క. |
సురచాపచిత్రగగన | స్ఫురణం బురణించునట్లు భూవనిత నిరం తరచిత్రిత యై యొప్పెను | సురుచిరనవతృణశిలీంధ్రసురగోపములన్. |
138 |
| వ. | తత్సమయానంతరంబున. | 139 |
| ఉ. |
భూసతికిం దివంబునకుఁ బొ ల్పెసఁగంగ శరత్సమాగమం బాసకల ప్రమోదకర మై విలసిల్లె మహర్షిమండలో పాసిత రాజహంస గతి భాతి ప్రసన్న సరస్వతీక మ బ్జాసనశోభితం బగుచు నబ్జజుయానముతో సమానమై. |
140 |
| ఉ. |
శారదరాత్రు లుజ్జ్వలలసత్తరతారకహారపంక్తులం జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో దారసమీరసౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క ర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై. |
141 |
| ఆరణ్యపర్వ చతుర్థాశ్వాసంలో నన్నయభట్ట కవిత్వము సంపూర్ణము. | ||