| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - పంచమాశ్వాసము |
| క. |
చరమయుగచరిత ధర్మ | స్థిరీకరణచతురచరిత! ధీగుణలీలా పరికరపరిచితనయ | విస్తర! వితరణ వివరణైక దానవినోదా! |
415 |
| మాలిని |
కరివరకిరికూర్మక్ష్మాధరాధీశ తుల్యో ద్ధరణగుణధురీణోద్దండబాహార్గళాగ్ర స్ఫురిత నిఖిలగోత్రాభోగ భాగైక భోగా తరుణ రుచిరమూర్తీ! ధర్మతంత్రానువర్తీ! |
416 |
| గద్య. | ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునం దారణ్యపర్వంబున యక్ష యుద్ధంబును, గుబేరదర్శనంబును, నర్జునాగమనంబును, బాండవులకడకు నింద్రుండు సనుదెంచుటయు, నర్జునుండు నివాతకవచ కాలకేయ పౌలోమ వధ ప్రకారం బెఱింగించుటయు, నాజగరంబును, బాండవులు గామ్యకవనంబునకు వచ్చుటయుఁ; గృష్ణమార్కండేయాగమనంబును, బ్రాహ్మణప్రభావంబును, సరస్వతీగీతయు, వైవస్వతు చరితంబును,గల్పాంతప్రకారంబును, యుగధర్మకీర్తనంబును, వామ్యాశ్వహరణంబును, నింద్రద్యుమ్నోపాఖ్యానంబును, ధుంధుమారచరితంబును నన్నది చతుర్థాశ్వాసము. | 417 |