| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
చిత్తంబునఁ బైకొనియెడు | నుత్తలము నడంచి ముఖపయోరుహమునఁ ద ళ్కొత్తెడు వెడనవ్వునఁ బ్రియు | చిత్తం బిగురొత్తఁ జనియెఁ జెలువ యడవికిన్. |
211 |
| వ. | ఇట్లాదంపతులు మందగమనంబున నరిగి పరిసరారణ్యంబు దఱియం జొచ్చి; రప్పుడు. | 212 |
| సీ. |
కమనీయ కమలినీ కల్లోలవీథులఁ | గదలు రాయంచలగతుల యొప్పు, బహుపుష్పపల్లవప్రకర చిత్రితములై | తనరారు తరులతాతతుల సొంపు, మకరందరసపానమదవిలోలంబులై | క్రాలెడి యెలదేఁటి గముల యులివుఁ, బరిపక్వమంజుల ఫలరసోద్ధతములై | పలుకు రాచిలుకలు పటురవంబుఁ, |
|
| ఆ. |
బ్రియుఁడు వేఱు వేఱ ప్రీతిమైఁ జూపుచుఁ | జెప్పుచును జనంగఁ జిగురుఁబోఁడి గనుచు వినుచు నిర్వికారసల్లాప మిం | పార నతనితెఱఁగు నరయుచుండె. |
213 |
| వ. | తదనంతరంబ యారాజర్షినందనుండు మధురంబు లగు ఫలంబులు గోయుచు గరిడియ నిండించి, యొక్కయెడఁ బరశుపాతంబునఁ గాష్ఠదళనంబు సేయందొడంగి శ్రమంపడి యొల్లంబోయి గొడ్డలి పుడమిపై వైచి, నిరంతరనిశ్వాసవేగవిషణ్ణవదనుం డగుచు సావిత్రిం గనుంగొని. | 214 |
| చ. |
‘ఒడలు వశంబు గాదు, భ్రమ నొందినయట్లు మనంబు దూలెడిం, గడఁగి శిరంబు శూలవిశిఖప్రకరంబున నొంచినట్టి ద య్యెడు, నిలువంగ నోప; నొకయించుకసేపు శ్రమంబు దీఱ నీ యెడ శయనింతు’ నావుడు సితేక్షణ మెత్తని సంభ్రమంబుతోన్. |
215 |
| క. |
తనయంకతలము ప్రియుశిర | మున కుపధానముగఁ జేయ భూపతనయుఁ డొ య్యన వ్రాలి సోలి నిశ్చే | తనుఁడైనట్లుండెఁ; గొంతతడవున కెదురన్. |
216 |
| మ. |
కనియెం గోమలి నీలమేఘవిలసత్కాలాంజనాకారు, ఘో రనిశాతోత్కటదంష్ట్రు, నుజ్జ్వలచలద్రక్తాక్షుఁ, బ్రత్యగ్ర కాం చనవర్ణాంబరు, నంత్యకాలదహనజ్వాలాప్రచండున్, జగ జ్జనసంత్రాసను, నొక్కదివ్యుఁ, బటుపాశప్రౌఢహస్తోద్ధతున్. |
217 |
| వ. | అప్పురుషుండును నధికసంరంభంబున సత్యవంతుం గదిసిన నయ్యింతి యెంతయు భయంబునం బ్రియునిశిరం బొయ్యన దిగువం జేర్చి నిల్చి కృతాంజలియై ‘యయ్యా! నీ వెవ్వ? రియ్యెడకు నెయ్యది సేయం దలంచి విజయంచేసి?’ తనిన నతం డిట్లనియె. | 218 |
| సీ. |
‘కాలుండఁ జువ్వె యేఁ గమలాక్షి! నను నీవు | మహిత పాతివ్రత్యమహిమఁ జేసి కానంగఁ జాలితి; కానరా దన్యుల; | కిదె నీదుభర్తకు నిపుడు కాల మగుటయు వీఁడు మహాపుణ్యనిధి గాన | యితరులఁ బనుపక యేన వీనిఁ గ్రచ్చఱఁ గొనిపోవఁగాఁ జనుదెంచితి’ | నని యుగ్రభంగి నయ్యంతకుండు |
|
| ఆ. |
ధరణినాథతనయుతనువునఁ బ్రాదేశ | పరిమితాత్ముఁ డగుచుఁ బ్రజ్వరిల్లు జీవు వెడలఁ దిగిచి, చెచ్చెర నతిదీర్ఘ | భయదపాశనికరబద్ధుఁ జేసి. |
219 |
| మ. |
కొని వేగంబున దక్షిణాభిముఖుఁడై ఘోరంపుమార్గంబునం జనఁగాఁ జొచ్చె; ననంతరంబ మదిలో సావిత్రి శోకంబు పై కొనఁ బ్రాణేశ్వరుదేహ మొక్కయెడ సంగుప్తంబు గావించి యా తనిపజ్జం దగఁ దాను నేఁగెఁ బదపద్మంబుల్ పొరిం దొట్రిలన్. |
220 |
| ఆ. |
దానిఁ జూచి దండధరుఁడు ‘నీ విట్లేల | వచ్చెదవు లతాంగి! వలదు నిలువు మింక; నీ కగమ్య మిటమీఁది తెరువెల్ల’ | ననిన నతని కిట్టు లనియెఁ బొలఁతి. |
221 |
| క. |
‘పతు లెందుఁ జనిన నచటికి | సతులుం జనవలదె? నీప్రసాదమునను మ త్పతిభక్తికతమునను సం | స్తుతగుణ! నా కరుగరానిచోటుం గలదే? |
222 |
| వ. | సకలమార్గంబులయందును ధర్మమార్గంబు ప్రధానం; బట్టి ధర్మంబునకు నాధారంబు సజ్జనుల యని వినంబడు; సజ్జనసందర్శనం బెప్పుడువృథగాదు గావున సజ్జనశేఖరుండ వనంజను నీదైన సందర్శనంబునం బరమశుభంబు నొందక యేను రిత్తజనంబులతెఱంగున నూఱక యెట్లు మగుడుదు?’ ననిన దాని ప్రగల్భవచనంబులకు నద్భుతం బంది ధర్ముం డిట్లనియె. | 223 |
| ఆ. |
‘తనులతాంగి! భవదుదారవాగ్భంగికి | మెచ్చు వచ్చె నాత్మ; నిచ్చువాఁడ వేఁడు మొక్కవరము విభునిజీవితమొక్క | టియును దక్కనేది యయిన నొండు.’ |
224 |