| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| వ. | అంగంబులు వొదల నెదురుకొనియె; ని ట్లిరువురు సుసంగతులై సుసంగతపత్ర ప్రకరతరుచ్ఛాయాశీతల సికతాతలంబున సుఖాసీనులై; రయ్యహీంద్రుం డా మహీసురవరునితో మధురస్వరంబున నిట్లనియె. | 592 |
| తే. |
‘అనఘ! నా రాక వార్చి నీ వధికనిష్ఠ | నిట్టు లునికికిఁ గారణమేమి గోర్కి యెవ్విధంబైన దాని నే నిపుడ నిర్వ | హించి పుచ్చెద నత్తెఱం గెఱుఁగఁ జెపుమ! |
593 |
| వ. | స్వజనంబులచేత నిచ్చట నీ యునికి విని యభిగమ్యుండ వగు నీ కడకుం జనుదెంచితి; ననవుడు నద్ధరామరవరుండు ధర్మారణ్యంబుననుండి నిన్నుం గాన వచ్చితి; మాననీయమహీసురసూనుండ; భాను నారాధింప నీ చనుట భవదీయ వల్లభవలన నెఱింగి వాడిన చేనివాఁడు వానకెదురుచూచునట్లు భవదాగమనంబు వార్చి నియతవృత్తి నున్నవాఁడ. మదీయమనఃక్లేశంబు నిరసింప నీవ యర్హుండ’ వనుటయు. | 594 |
| తే. |
‘నీవు కల్యాణమూర్తివి నీ మనోర | థంబు సఫలంబు సేసికదా మదీయ జనన సఫలత గలిగింతు’ నను భుజంగ | మాధిపతి మోముఁ జూచి యిట్లనియె నతఁడు. |
595 |
| క. |
నా కోర్కి పిదపఁ జెప్పెద | లోకనుతా! యొకటి యడుగ లోలత్వము చి త్తాకలితమయ్యెఁ బ్రార్థన | సేకొని యది నాకు మున్ను చెప్పఁగవలయున్. |
596 |
| వ. | అనుటయు నయ్యురగ వల్లభుం ‘డది యెయ్యది యడుగు’ మనిన భృగుండు ‘నీవు రవిరథంబు వహింపం జనినయెడఁ గనిన వినినయట్టి యాశ్చర్యంబులు గలవేని వాని నా కెఱింగింపవే?’ యనిన నతం డతని కిట్లనియె. | 597 |
| సీ. |
‘ఆశ్చర్యములకెల్ల నాస్పదం బాదిత్యుఁ | డాతని వలనన భూతజాల మఖిలంబుఁ జరియించు నది యచ్చెరువు గాదె! | యద్దేవు నంశువులందుఁ బ్రీతి నమరులు వాలఖిల్యాదిమునీంద్రులు | సిద్ధులు శాఖలఁ జెంది యుండు విహగకులంబుల విధమున వసియింతు | రంతకంటెను నెక్కు డద్భుతంబు |
|
| తే. |
గలదె! యమ్మహాత్మువలనన వాయువు | వెడలి యతని నడిమి విపుల రశ్మిఁ బొంది వృష్టి గురియు నెందును నట్టి చో | ద్యములు గలవె? భూసురాగ్రగణ్య! |
598 |
| క. |
రవి సృజియించును వర్షము | రవియ మగుడఁ గిరణతతుల రస మంతయుఁ దాఁ దివుచును విస్మయకారక | మవనీసురవర్య! దాని కధికము గలదే? |
599 |
| క. |
ఇనువేఁడిమి శోషించిన | జనములయం దాత్మనిష్ఠ శాశ్వతికత్వం బున వెలుఁగుచుండు దానికి | ననఘా! మిగులంగఁ జిత్రమైనది గలదే! |
600 |
| తే. |
సూర్యువలనన బీజంబు ధార్యమాణ | మగుఁ జరాచరధారిణియైన ధరణి చేత నంతకు మిగులఁ జర్చింప నక్క | జంబు లెందును గలవె? నిష్ఠానిరూఢ! |
601 |
| క. |
పరముండు నిరంజనుఁ డ | క్షరుఁ డజరుం డద్వయుండు శాశ్వతుఁ డగు న ప్పురుషుఁడు రవియంద వెలుఁగు | నరుఁ దంతటికంటెఁ గలదె? యగ్రిమవర్ణా! |
602 |
| వ. | అని వెండియు. | 603 |